బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్ అయ్యిందా..?

నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ఛెంఘీజ్ ఖాన్ బయోపిక్. చాలా సార్లు ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పారు. 100 సినిమాలు పూర్తి చేసిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. తెలుగు ప్రేక్షకులకు ఛెంఘీజ్ ఖాన్ గురించి అంతగా తెలియదు కాబట్టి కమర్షియల్ సినిమాగా రూపొందించేందుకు కథను వండుతున్నారట. ఇంతకీ ఎవరీ ఛెంఘీజ్ ఖాన్ అనుకుంటున్నారా..? మంగోల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. ఆయన చరిత్రలో నిలిచిపోయే ఎన్నో కార్యక్రమాలు చేశాడు.

ఆయన పునాది వేసిన మంగోల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యంగా నిలిచింది. ఈశాన్య ఆసియాకు చెందిన ఓ సంచార జాతికి చెందిన వాడు చెంఘీజ్ ఖాన్. షామనిజం మతానికి చెందిన ఈయన ఈశాన్య ఆసియాకు చెందిన ఎన్నో సంచార తెగలను ఐక్యం చేసిన ఘనత దక్కించుకున్నాడు. అలాంటి చెంఘీజ్ ఖాన్  జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను రూపొందించాలంటే మంచి అనుభవం ఉన్న దర్శకుడు కావాలి. అయితే.. ఇప్పటికే ఒక ప్రముఖ దర్శకుడు ఈ బాధ్యతను తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడని తెలిసింది. ఇప్పటికే బాలయ్యకి ఈ నిర్మాత అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందట. ఒకటి రెండు నెలల్లో ప్రాథమిక స్క్రిప్ట్ తో బాలయ్య ముందు ఉంటారట. ఒక వేళ అది నచ్చితే ఆలస్యం చేయకుండా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే బాలయ్య డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ తో బాలయ్య 2025 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వస్తారని అంటున్నారు. మరి.. అన్నీ అనుకున్నట్టుగా జరిగి బాలయ్య ఛెంఘీజ్ ఖాన్ గా నటిస్తే.. ఈ సినిమా సంచలనమే. అయితే.. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *