రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ స్టోరీ ఇదేనా..?

అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా టాలీవుడ్ లో సంచలన విజయం సాధించడమే కాకుండా.. బాలీవుడ్ లో కూడా అదే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరో రణ్‌ భీర్ కపూర్ తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి అసలు ఈ సినిమా కథ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగష్టు 11న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

ఇందులో రణ్ బీర్ కపూర్ కు జంటగా రష్మిక నటిస్తుంది. ఈ సినిమా పై నార్త్ లోనే కాదు సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అంటూ స్టోరీ లీక్ అయ్యింది. ఇంతకీ కథ ఏంటంటే.. హీరో ఫిజిక్స్ లెక్చరర్. తండ్రి అండర్ వరల్డ్ డాన్. అయినప్పటికీ హీరో అవేమి పట్టించుకోకుండా తను సింపుల్ గా బ్రతుకుతుంటాడట. అలాంటి హీరో తన తండ్రి మాఫియా గొడవల్లో చనిపోతాడట. అయితే.. తండ్రి మరణం తర్వాత హీరో యానిమల్ గా మారి ప్రత్యర్థులను ఊచకోత కోయడం జరుగుతుందట.

ప్రచారంలో ఉన్న కథ నిజమో కాదో తెలియదు కానీ దర్శకుడు చూపించే విధానం కొత్తగా ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా ఆకట్టుకోవడం ఖాయం అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెలుగులో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా మొదలు పెట్టనున్నారు. మరి.. యానిమల్ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *