వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలి ప్రయత్నంగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో హన్సిక ఒకే పాత్ర పోషించగా రాజు దుస్సా రచన దర్శకత్వంలో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. ప్రపంచంలోనే మొదటి సారిగా సింగిల్ షాట్.. సింగిల్ క్యారక్టర్ తో హన్సిక నటించగా తీసిన సినిమా వన్ నాట్ ఫైవ్ మినిట్స్. ఒక గంట నలభై అయిదు నిముషాల పాటూ సాగే ఒక ఉత్కంఠ రేపే కథను సింగిల్ షాట్ లో అంతే ఎంగేజింగ్ గా తెరకెక్కించడం సాహసమే. హాలీవుడ్ లో సింగిల్ షాట్ టెక్నిక్ లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల తరహాల చిత్రం రూపొందించబడింది.
ఆ చిత్రాలు సింగిల్ షాట్ తో తీసినా చాలా క్యారక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది. కానీ వన్ నాట్ ఫైవ్ మినిట్స్ ఒకే పాత్రతో రన్ అయ్యే సినిమా. ఇంకా రీల్ టైం, రియల్ టైం ఒకేలా ఉండి మనం ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభూతి చెందుతాం. డైలాగులు కూడా చాలా తక్కువగా అవసరమైనంత వరకే పరిమితమై గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోనే సినిమా జరుగుతుంది. ఈ వినూత్న ప్రయోగాన్ని భారతదేశం లోనే తొలిసారిగా తెలుగు లో చేయడం గొప్ప విషయం. ఈ చిత్రానికి ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడకుండా లైవ్ గా షూట్ చేసి సి జీ వర్క్ యాడ్ చేయడం ప్రత్యేక ఆకర్షణ. ఇది డైరెక్టర్ విజన్ కు డి ఓ పి ప్రతిభకు తార్కాణం. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ సినిమా అనుకున్నదాని కంటే చాలా బాగా వచ్చిందని చిత్రం బృందం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టెక్నికల్ గా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో చేసిన ఈ మూవీ ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోతుంది.
సింగిల్ క్యారక్టర్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాత్రకు హన్సిక యాప్ట్. ఆవిడ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు. చిత్రం అంతా సింగిల్ షాట్ లో కేవలం తన పాత్ర మీదే నడిచే సినిమా కాబట్టి తన స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ప్రెషన్స్ తో మొత్తం చిత్రాన్ని తనే క్యారీ చేయాలి. తను ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఒక అదృశ్య శక్తి నుండి తనను తాను కాపాడుకునే అమ్మాయిగా ప్రతి షాట్ లో అద్భుతమైన హావభావాలు పలికించింది. హన్సిక కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. సినిమా చూశాక అందరి అభిప్రాయం ఇదే ఉంటుంది. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రీ రికార్డింగ్ ప్రాణం. దర్శకులు ఈ చిత్రం గురించి చెప్పినప్పుడే ఆయన ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో చేసిన బిజీఎం సినిమా ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. సినిమా చూస్తున్నంత సేపు పాత్రతో పాటూ మనం ప్రయాణిస్తున్న ఫీలింగ్ వస్తుంది. సామ్ తన మ్యూజిక్ తో ఆద్యంతం టెన్షన్ నీ క్రియేట్ చేశారు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేయనున్నారు. సినిమా కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.