కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని 1861 చట్టానికి లోబడే జీవో నెం.1 తీసుకువచ్చామని ఆంధ్ర ప్రదేశ్ రవిశంకర్ స్పష్టం చేశారు. దీని ప్రకారం సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదని, అయితే నియమనిబంధనలకు లోబడి సభలు, సమావేశాలు జరుపుకోవాల్సి ఉంటుందని తెలిపారు. జీవో నెం.1పై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత తలెత్తుతున్న దృష్ట్యా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరనైచ్చారు. ప్రజల భద్రత ప్రభుత్వానికి చాలా ముఖ్యమైన అంశమని, ఈ జీవోపై వాస్తవాలను మీడియా ప్రజలకు  వెల్లడించాలని సూచించారు.  రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందన్న నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు పోలీసులు అనుమతి నిరాకరించవచ్చని తెలిపారు.

ఆయా సభలకు పోలీసులు ప్రత్యామ్నాయ వేదికలు సూచిస్తారని, లేకపోతే సభల నిర్వాహకులే ప్రత్యామ్నాయాలు సూచించవచ్చని పేర్కొన్నారు. కొన్ని అరుదైన పరిస్థితుల్లో సభలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, ఎక్కడా సభలను నిషేధిస్తామని జీవోలో చెప్పలేదని వివరించారు. ఇది జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు వర్తిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *