Thursday, April 25, 2024
HomeTrending Newsమూడు రాజధానులు ఉంటాయి: బొత్స స్పష్టం

మూడు రాజధానులు ఉంటాయి: బొత్స స్పష్టం

Botsa On 3 Capitals:

ముమ్మాటికీ మూడు రాజధానులు  ఉంటాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పారు. పెయిడ్ ఆర్టిస్టులతో అమరావతి పాదయాత్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఏపీలో చంద్రబాబుకు ఇళ్లు లేదు, ఓటు లేదని ఎద్దేవా చేశారు.  ఎమ్మెల్యే కోటా నుంచి భర్తీ చేస్తున్న మూడు శాసనమండలి స్థానాలకు అధికార పార్టీ అభ్యర్ధులు నేడు నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలతో కలిసి బొత్స హాజరయ్యారు.

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ కుప్పంలో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 14  ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పంకు మంచినీళ్ళు ఇవ్వలేకపోయారంటే సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. కుప్పంకు 40 ఏళ్ళపాటు అయన ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తు చేశారు. దొంగ ఓట్ల సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసనీ, ఓడిపోతామని తెలిసే చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు.

బీసీలు, ఎస్సీలు, మైనార్టీలకు సామాజిక న్యాయం జరిగినప్పుడే అభివృద్ధి, సంక్షేమ ఫలాలను కింది స్థాయి వరకూ తీసుకువెళ్లగలమని సిఎం జగన్ ప్రగాఢ విశ్వాసమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు కల్పించేందుకు జగన్ కంకణబద్ధులై ఉన్నారని చెప్పారు.  ఎమ్మెల్యే కోటా మూడింటితో పాటు స్థానిక సంస్థల నుంచి మరో 11 స్థానాలకు కూడా నేడు నోటిఫికేషన్ విడుదలైందని, ఈ 14 స్థానాలు తమకే దక్కుతాయని చెప్పారు. ప్రస్తుతం సభలో 18 మంది వైసీపీ సభ్యులు ఉన్నారని, ప్రస్తుత ఎన్నికల తరవాత తమ బలం 32 కు చేరుతుందని చెప్పారు.

మొత్తం 32 మంది సభ్యుల్లో 18 స్థానాలు ఎస్సీ, బీసీ, మైనార్టీలకు కేటాయించామని.. వీటిలో నాలుగు స్థానాలు మైనార్టీలకు ఇచ్చామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మైనార్టీలు ఇంతమందికి మండలిలో స్థానం ఇవ్వలేదని చెప్పారు.  తాము అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పోస్టులతో పాటు, చట్ట సభలు, స్థానిక సంస్థల్లో కూడా యాభై శాతానికి పైగా వెనుకబడిన వర్గాలకు కేటాయిస్తున్నామని  వెల్లడించారు.

గత తెలుగుదేశం హయంలో ఈ వర్గాలకు కేవలం 11 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారని, అందులోనూ జగన్ ప్రకటించిన తరువాతే మైనార్టీ కోటాలో ఫరూక్ ను మండలికి పంపారని సజ్జల గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు ప్రతి ఎన్నికలలో తిరస్కరిస్తున్నారని, ఇప్పటివరకూ మండలిలో టిడిపి సైంధవ పాత్ర పోషించిందని సజ్జల విమర్శించారు.

Also Read :  అది స్వాతంత్ర్య పోరాటంతో సమానం: హైకోర్టు సిజే

RELATED ARTICLES

Most Popular

న్యూస్