Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్యువతను ప్రోత్సహించేందుకే: పీవీ సింధు

యువతను ప్రోత్సహించేందుకే: పీవీ సింధు

యువతను ప్రోత్సహించేందుకే తాను విశాఖపట్నంలో అకాడమీ ప్రారంభిస్తున్నానని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు చెప్పారు. చాలా మంది యువత సరైన ప్రోత్సాహం లేక వెనుకబడుతున్నారని ఆమె అన్నారు. అన్నారు. శుక్రవారం పీవీ సింధు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారితో పాటు చాముండేశ్వరీనాథ్‌ కూడా ఉన్నారు.

అనంతరం సింధు మాట్లాడుతూ “శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఏడాది స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వస్తాను. ఈ సారి ఒలింపిక్స్ అయ్యాక తిరుమలకు వచ్చాను. స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరాను. త్వరలో జరగబోయే టోర్నమెంట్లలో  కూడా స్వామి వారి ఆశీస్సులు ఉండాలి. మంచి మెడల్‌తో అందిరి ముందుకు వస్తాను. ప్రజలందరూ కోవిడ్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలి’’ అని అన్నారు.

ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో  సింధు కాంస్యపతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. ఇవాళ విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular