Wednesday, July 3, 2024
HomeTrending NewsPakistan: ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ సైన్యంపై... తాలిబాన్ మిలిటెంట్ల దాడి

Pakistan: ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ సైన్యంపై… తాలిబాన్ మిలిటెంట్ల దాడి

పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాక్ సైనికులు…తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ కు చెందిన వర్గాల మధ్య కాల్పులు సాగుతున్నాయి. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలోని చిత్రాల్ ప్రాంతంలో జరుగుతున్న ఈ పోరులో పాకిస్థాన్ సైన్యానికి నష్టం ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. చిత్రాల్ కు 30 కిలోమీటర్ల దూరంలో రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటివరకు సుమారు 16 మంది చనిపోయినట్టు సమాచారం. చనిపోయినవారిలో ఎక్కువగా ఉగ్రవాదులు ఉన్నట్టు పాక్ సైనిక వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు ప్రాంతాలకు అదనపు బలగాలను పంపారు.

ఆయితే అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం పాక్ సైన్యానికి తీరని నష్టం జరిగిందని విశ్లేషిస్తున్నాయి. చిత్రాల్ సమీపంలోని రెండు సైనిక పోస్టులను టిటిపి మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్నారని ప్రకటించాయి. ఆఫ్ఘన్ నుంచి తెహ్రీక్ ఏ తాలిబాన్ మిలిటెంట్లు వందల సంఖ్యలో వచ్చారు. గత మూడు రోజుల నుంచే తెహ్రీక్ ఏ తాలిబాన్  ఫైటర్స్ భారీ ఆయుధ సామగ్రితో దాడులకు దిగుతున్నారు.

సహజంగా ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో తెహ్రీక్ ఏ తాలిబాన్ సంస్థకు పట్టుంది. దీంతో పాక్ సైన్యానికి మిలిటెంట్ల కదలికలు తెలుసుకోవటం కష్టతరంగా మారింది. బొమ్బారిట్ లోయలో టిటిపి మిలిటెంట్లు బహిరంగంగానే సాయుధులై తిరుగుతున్నారు. పర్యాటక ప్రాంతమైన చిత్రాల్ పరిసరాలు…ఇప్పుడు రక్తసిక్తం అయ్యాయి. పాక్ సైన్యం పర్యాటక ప్రాంతాలను సీజ్ చేశాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్