Saturday, June 13, 2026
Homeస్పోర్ట్స్ ICC Men’s T20 World Cup 2022: పాకిస్తాన్ కు తొలి విజయం

 ICC Men’s T20 World Cup 2022: పాకిస్తాన్ కు తొలి విజయం

పురుషుల టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తొలి విజయం నమోదు చేసింది. నెదర్లాండ్స్ తో నేడు జరిగిన మ్యాచ్ లో6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పాక్ బౌలర్ల ధాటికి డచ్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 91 పరుగులు మాత్రమే చేయగలిగారు. జట్టు మొత్తంలో ఆకేర్మాన్-27;  కెప్టెన్ ఎడ్వర్డ్స్-15 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ మూడు; మహమ్మద్ వసీమ్ జూనియర్ రెండు; షహీద్ ఆఫ్రిది, నసీమ్ షా, హారిస్ రాఫ్ తలా ఒక వికెట్ సాధించారు.

ఈ లక్ష్యాన్ని పాకిస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 13.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ బాబర్ అజామ్ కేవలం నాలుగు పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. మహమ్మద్ రిజ్వాన్-49; ఫఖర్-20; షాన్ మసూద్- 12 పరుగులు చేశారు.

మూడు వికెట్లు తీసిన షాదాబ్ ఖాన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular