Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్AFG Vs PAK: చివరి టి20లో పాక్ గెలుపు

AFG Vs PAK: చివరి టి20లో పాక్ గెలుపు

ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతోన్న టి20 సిరీస్ చివరి  మ్యాచ్ లో పాకిస్తాన్ 66  పరుగులతో ఘన విజయం సాధించింది. షార్జా వేదికగా ఈ రెండు జట్ల మధ్యా మూడు మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. వరుసగా రెండు టి 20ల్లో విజయం సాధించి ఇప్పటికే ఆఫ్ఘన్ జట్టు సిరీస్ సొంతం చేసుకుంది.  నేడు జరిగిన చివరి మ్యాచ్ లో ఆఫ్ఘన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

పాక్ జట్టులో సయీమ్ అయూబ్-49; ఇఫ్తికార్ అహ్మద్-31; కెప్టెన్ షాదాబ్ ఖాన్-28; షఫీక్-23 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ 2, మిగిలిన వారు తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆఫ్ఘన్ 35 వద్ద తొలి వికెట్ (రహమతుల్లా గుర్జాబ్-18) కోల్పోయింది. అమర్ తుల్లా ఒమర్జాయ్ ఒక్కడే 21 రన్స్ తో హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. 18.4 ఓవర్లలో 116పరుగులకే ఆలౌట్ అయ్యింది.

పాక్ బౌలర్లలో ఇషానుల్లా, షాదాబ్ ఖాన్ చెరో మూడు; ఇమాద్ వసీమ్, జమాన్ ఖాన్, మహమ్మద్ వసీమ్ జూనియర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

షాదాబ్ ఖాన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’….. మొహమ్మద్ నబీ కి ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్