Sunday, June 7, 2026
Homeసినిమాప్రభాస్ తో పరశురాం?

ప్రభాస్ తో పరశురాం?

P2P: ప్ర‌భాస్ తో మూవీ ప్లాన్ చేస్తోన్న మ‌హేష్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..?  ప‌ర‌శురామ్. అవును.. స‌ర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ప‌ర‌శురామ్ ప్ర‌స్తుతం స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. త‌దుప‌రి చిత్రాన్ని యువ స‌మ్రాట్ నాగ‌చైత‌న్య‌తో చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. త్వ‌ర‌లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ప‌ర‌శురామ్ ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకొని ఓ కథ రాయడానికి రెడీ అవుతున్నాడట‌. ఎప్పట్నుంచో తన మనసులో ఉన్న పాయింట్ ను ప్రభాస్ మేనరిజమ్స్, ఇమేజ్ కు తగ్గట్టు కథగా మార్చాలని అనుకుంటున్నాడని తెలిసింది. ప్రభాస్ కు త్వ‌ర‌లోనే స్టోరీ లైన్ వినిపించాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ప్రభాస్ కనుక ఓకే చెబితే.. అదే లైన్ పై పూర్తి స్థాయిలో వర్క్ మొదలుపెట్టాలనేది పరశురామ్ ఆలోచన.

ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ – కె, సలార్ సినిమాలు పూర్తవ్వాలి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో స్పిరిట్, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయాలి. ప‌ర‌శురామ్ మెప్పిస్తే.. ఈ కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత సినిమా ఉంటుంది. మ‌రి.. ప్ర‌భాస్ ని ప‌ర‌శురామ్ క‌థ‌తో మెప్పిస్తాడో లేదో చూడాలి.

Also Read : ప్ర‌భాస్ స్పిరిట్ మూవీలో కైరా.. ఇది నిజమేనా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular