Saturday, January 18, 2025
HomeTrending Newsనేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ముందుకు తీసుకొస్తారు. రేపు 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతారు. ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నాయి.

90 ఏండ్ల నాటి ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్‌ విధేయక్‌-2024 బిల్లుతో సహా మొత్తం ఆరు బిల్లులను ప్రవేశపెట్టాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం.

పార్లమెంట్‌ సమావేశాల్లో అధికారా పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్ర శస్త్రాలు సిద్దం చేస్తున్నాయి. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధుల విడుదలలో అన్యాయం జరుగుతోందని… ఈ అంశం ప్రధానంగా ప్రస్తావించేందుకు అజెండా రూపొందించాయి.

నీట్‌ లీకేజీ వ్యవహారం, రైల్వే భద్రత తదితర అంశాలపై ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. అంశాల వారిగా కసరత్తు చేస్తున్న విపక్ష కూటమిలోని పార్టీలు కేంద్రాన్ని డీకొనేందుకు సమన్వయంతో సాగనున్నాయి.

మరోవైపు  ‘హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ రాజ్యసభ’లోని పలు సారాంశాలను ప్రస్తావిస్తూ రాజ్యసభ సచివాలయం తాజాగా బులెటిన్‌ విడుదల చేసింది. సభాపతి రూలింగ్స్‌ను సభలో కానీ, సభ బయట కానీ ఎంపీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విమర్శించకూడదని పేర్కొన్నది. అదేవిధంగా వందేమాతరం, జై హింద్‌ సహా ఏ ఇతర నినాదాలు చేయకూదని గుర్తుచేసింది. సభలో ప్లకార్డులు ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్