Friday, March 13, 2026
HomeTrending NewsBRS: బీఆర్‌ఎస్ శిక్షణ శిబిరాలు... గులాబీమయమైన నాందేడ్

BRS: బీఆర్‌ఎస్ శిక్షణ శిబిరాలు… గులాబీమయమైన నాందేడ్

జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్‌ఎస్.. తెలంగాణ వెలుపల తొలిసారిగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో రెండు రోజులపాటు నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా శిబిరాలను బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంతి కే చంద్రశేఖర్‌రావు మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పార్టీ నాయకులు పూర్తిచేశారు. శిబిరం నిర్వహించే అనంత్‌లాన్స్‌ వేదిక మొత్తం గులాబీ మయమైంది. నాందేడ్‌ వ్యాప్తంగా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌, దేశ్‌ కీ నేత కైసే హో కేసీఆర్‌ జైసే హో.. దేశ్‌ కీ నేత కేసీఆర్‌ వంటి నినాదాలతో ఫ్లెక్సీలు ఆకర్షిస్తున్నాయి. నాందేడ్‌ విమానాశ్రయం నుంచి అనంత్‌లాన్స్‌ మార్గంతోపాటు రైల్వేస్టేషన్‌ సహా ప్రధాన కూడళ్లలో గులాబీ ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి. వేదికపై రాజ్యంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, జ్యోతీబాపూలే, ఛత్రపతి శివాజీతోపాటు మరాఠ నాయకుల ఫొటోలను ఏర్పాటు చేశారు.

మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు శిక్షణా శిబిరాలకు తరలివచ్చారు. రాష్ట్రంలోని ఆరు డివిజన్లకు సంబంధించిన ముఖ్య నాయకులతోపాటు ప్రతీ నియోజకవర్గం నుంచి కన్వీనర్‌, సమన్వయకర్త, మహిళా విభాగం కన్వీనర్‌, రైతు విభాగం కన్వీనర్‌, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు ఈ శిబిరాలకు తరలివచ్చారు. పాసులు ఉన్నవారినే శిబిరంలోకి అనుమతిస్తున్నారు. దీంతో పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాసులు తీసుకున్నారు.
రెండు రోజుల శిక్షణ అనంతరం నియోజకవర్గాలవారీగా పార్టీ ప్రచార సామగ్రి.. కరపత్రాలు, గులాబీ కండువాలు, టోపీలు, వాల్‌పోస్టర్లను పార్టీ బాధ్యులకు అందజేయనున్నారు. వీటితోపాటు నెలరోజులపాటు చేపట్టనున్న పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన పుస్తకాలను కూడా నియోజకవర్గాలవారీగా పంపిణీ చేయనున్నారు. మహారాష్ట్ర కళా సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, వివిధ కళారూపాలకు సంబంధించిన సాంస్కృతిక బాండాగారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular