రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 15 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని ఈ తెల్లవారుఝామున గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పెద్ద ఎత్తున హాజరై సిఎం జగన్ కు ఘనస్వాగతం పలికారు.
ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ ,మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనీల్ కుమార్ , ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టిజె.సుధాకర్ బాబు, కోన రఘుపతి,ముదునూరి ప్రసాదరాజు,శిల్పా చక్రపాణిరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహుల్లా, మొండితోక అరుణ్ కుమార్, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్ధి సర్నాల తిరుపతిరావు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్ధి షేక్ ఆసిఫ్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్ధి నూర్ ఫాతిమా, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధి కారుమూరి సునీల్ తదితరులుస్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
ఈ సాయంత్రం పార్టీ ముఖ్యనేతలతో సిఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ పై చర్చించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ ఈనెల 4న వైసీపీ సునామీ రాబోతోందని, జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ గెలుపు కోసం మహిళలు పెద్దఎత్తున ఓట్లు వేశారని, పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ముఖ్య నేతలతో సీఎం జగన్ చర్చిస్తారని, కౌంటింగ్ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నామని వివరించారు.