Ashes war begun:
ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ నేడు మొదలైంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ళలో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐదు వికెట్లతో సత్తా చాటగా, స్టార్క్ హాజెల్ వుడ్ చెరో రెండు, కామెరాన్ గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు.
ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో మొదలైన తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పరుగుల ఖాతా ప్రారంభించక ముందే ఓపెనర్ జోసెఫ్ బర్నర్ ను స్టార్క్ బౌల్డ్ చేశాడు. హాజెల్ వుడ్ నాలుగు, ఆరో ఓవర్లలో డేవిడ్ మలాన్, జో రూట్ లను పెవిలియన్ పంపి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బ తీశాడు. మొత్తం ముగ్గురు ఆటగాళ్ళు డకౌట్ అయ్యారు. జోస్ బట్లర్-39; ఒలీ పోప్-35; హసీబ్ హమీద్-25; క్రిస్ ఓక్స్-21 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మొత్తం 50.1 ఓవర్లపాటు ఆడిన ఇంగ్లాండ్ 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
అయితే ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ దిగే సమయంలో వర్షం పడడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.
Also Read : ఇండియాదే టెస్ట్ సిరీస్