Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: తమిళ్-జైపూర్ మ్యాచ్ డ్రా;  పాట్నా గెలుపు

ప్రొ కబడ్డీ: తమిళ్-జైపూర్ మ్యాచ్ డ్రా;  పాట్నా గెలుపు

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేటి మ్యాచ్ ల్లో తమిళ్ తలైవాస్- జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ డ్రా కాగా, బెంగుళూరుపై పాట్నా విజయం సాధించింది.

తమిళ్ తలైవాస్- జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 31-31తో డ్రా అయ్యింది. తొలి అర్ధ భాగంలో 17-13  తో జైపూర్ ఆధిక్యం సాధించగా రెండో అర్ధభాగంలో 18-14 తో తమిళ్ ముందంజలో నిలిచింది. మ్యాచ్ టైం పూర్తయ్యే నాటికి టై గా ముగిసింది.

పాట్నా పైరేట్స్ – బెంగుళూరు జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో  పాట్నా 38-31 తేడాతో విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 20-16 తో పాట్నా ముందంజలో నిలిచి ద్వితీయార్ధంలో కూడా రాణించి18-15 తో ఆధిక్యం ప్రదర్శించింది. చివరకు ఏడు పాయింట్ల తేడాతో విజయం పాట్నా ను వరించింది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత బెంగుళూరు బుల్స్ (39 పాయింట్లు); పాట్నా పైరేట్స్ (39); దబాంగ్ ఢిల్లీ (37); జైపూర్ పింక్ పాంథర్స్ (31); తమిళ్ తలైవాస్(30); యూపీ యోధ (28);; జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్