Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: పాట్నా, పూనే విజయం

ప్రొ కబడ్డీ: పాట్నా, పూనే విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో యూపీపై పాట్నా, ముంబై పై పూణే విజయం సాధించాయి.

పాట్నా పైరేట్స్ – యూపీ యోధ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 37-35తో పాట్నా గెలుపొందింది. తొలి అర్ధ భాగంలో 20-15తో  పాట్నా ఆధిక్యం సంపాదించింది. రెండో భాగంలో 20-17తో యూపీ పైచేయి సాధించింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి రెండు పాయింట్ల తేడాతో పాట్నా విజయం సొంతం చేసుకుంది. పాట్నా ఆటగాడు సచిన్ 12 పాయింట్లు సాధించాడు.

పునేరి పల్తాన్ – యూ ముంబాజట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 36-34తో పూణే విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 19-18 తో ముంబై స్వల్ప ఆధిక్యం సాధించింది. అయితే పూనే పుంజుకుని ఆది 18-15 తో మూడు పాయింట్ల పైచేయి ప్రదర్శించింది. దీనితో రెండు పాయింట్ల స్వల్ప తేడాతో పూనే గెలుపొందింది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… దబాంగ్ ఢిల్లీ (53 పాయింట్లు); బెంగుళూరు బుల్స్ (51); పాట్నా పైరేట్స్ (50); యూ ముంబా (43); హర్యానా స్టీలర్స్ (43); యూపీ యోధ (42); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Also Read : ప్రొ కబడ్డీ: గుజరాత్, బెంగుళూరు విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్