Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ:  ఫైనల్లో పాట్నా, ఢిల్లీ

ప్రొ కబడ్డీ:  ఫైనల్లో పాట్నా, ఢిల్లీ

Pro Kabaddi: పాట్నా పైరేట్స్, దబాంగ్ ఢిల్లీ ఈ సీజన్ వివో ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్స్ కు చేరుకున్నాయి.   నేడు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లలో యూపీ యోధపై పాట్నా; బెంగుళూరు బుల్స్ పై ఢిల్లీ విజయం సాధించాయి.

పాట్నా పైరేట్స్ – యూపీ యోధ జట్ల మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్లో 38-27తో పాట్నా విజయం సాధించింది. ఆట ప్రథమార్ధంలో పాట్నా జోరు ప్రదర్శించి 23-9తో భారీ ఆధిక్యం సంపాదించింది. ద్వితీయార్థంలో యూపీ పుంజుకుని మెరుగైన ఆట తీరు 18-15తో ముందంజలో నిలిచినా పూర్తి సమయం ముగిసేనాటికి 11 పాయింట్ల ఆధిక్యంతో నిలిచిన పాట్నా ఫైనల్స్ కు చేరుకుంది.

దబాంగ్ ఢిల్లీ – బెంగుళూరు బుల్స్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో 40-35తో ఢిల్లీ గెలుపొందింది. మొదటి నుంచీ హోరాహోరీగా సాటిన ఈ మ్యాచ్ లో మొదటిభాగం పూర్తయ్యే నాటికి 17-16తో బెంగుళూరు స్వల్ప ఆధిక్యం ప్రదర్శించింది. అయితే రెండో భాగంలో ఢిల్లీ ఆటగాళ్ళు సమిష్టిగా రాణించి బెంగుళూరు జోరుకు కళ్ళెం వేయగలిగారు, 24-18 తో లీడ్ సంపాదించారు. మ్యాచ్ సమయం పూర్తయ్యే నాటికీ 5 పాయింట్ల స్వల్ప ఆధిక్యంతో ఢిల్లీ ఫైనల్స్ లో అడుగు పెట్టింది. బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్ 18, ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ 14 పాయింట్లతో రాణించారు.

ఎల్లుండి ఫిబ్రవరి 25న ఫైనల్ జరగనుంది.

Also Read : ప్రొ కబడ్డీ:  సెమీస్ కు యూపీ, బెంగుళూరు

RELATED ARTICLES

Most Popular

న్యూస్