Friday, November 22, 2024
HomeTrending Newsరిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు సంచలన తీర్పు

రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు సంచలన తీర్పు

బీహార్ లో కుల గణన నిర్వహించి వాటి ఆధారంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిసి కోట పెంచారు. కుల ఆధారిత సర్వే నివేదిక ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లను పాట్నా హైకోర్టు ఈ రోజు(గురువారం) రద్దు చేసింది.

రాష్ట్ర రిజర్వేషన్ విధానాన్ని పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గత ఏడాది పాట్నా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిఐఎల్) దాఖలు అయ్యాయి. గతేడాది బీహార్‌ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు ఇచ్చారని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే నిబంధన లేదని పిటిషనర్లు వాదించారు. విచారణ జరిపిన పాట్నా హైకోర్టు.. 65 శాతానికి రిజర్వేషన్ల పెంపును రద్దు చేసింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు నిచ్చింది. 2023లో బీహార్ అసెంబ్లీ ప్రతిపాదించిన సవరణలకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్ తీర్పు వెలువరించారు.

బీహార్ రిజర్వేషన్ సవరణ బిల్లు కింది నితీష్ ప్రభుత్వం కోటా పెంచింది. వెనుకబడిన తరగతులకు 12 నుంచి 18 శాతానికి, షెడ్యూల్డ్ కులాలకు 16 నుంఛి 20 శాతానికి పెంచారు. షెడ్యూల్డ్ తెగలకు ఒకటి నుంచి 2 శాతం వరకు అత్యంత వెనుకబడిన తరగతులకు 18 నుంచి 25 వరకు పెంచారు. మరోవైపు బీసీ మహిళలకు 3% రిజర్వేషన్‌ను తొలగించారు.

రిజర్వేషన్ తేనెతుట్టె మళ్ళీ కదులుతోంది. బీహార్ ఉన్నత న్యాయస్థానం తీర్పుతో ఆ రాష్ట్రంలో ఆందోళనలు, నిరసనలు మొదలయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్