Friday, June 12, 2026
HomeTrending NewsPerni- Counter: బాబు కళ్ళల్లో ఆనందం కోసమే....

Perni- Counter: బాబు కళ్ళల్లో ఆనందం కోసమే….

బాధల్లో ఉన్నవారి ఇంటికి మనం వెళ్ళాలి కానీ మన కాళ్ళ దగ్గరకు వాళ్ళను రప్పించుకుంటామా అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఇప్పటం బాధితులను తన ఆఫీసుకు రప్పించి వారికి నష్ట పరిహారం అందించడాన్ని నాని తప్పు బట్టారు. ఇప్పటం గ్రామంలో తనకు మద్దతిచ్చిన వారి గడపలు కూల్చి వేశారని, గుండెల్లో గునపం దింపారంటూ పవన్ చెప్పడాన్ని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో రాజధానికి భూములు ఇవ్వలేదని పొలాలు తగలబెట్టినప్పుడు ఏ గునపం దిగలేదా అని నిలదీశారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేర్ని… నేడు పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

పవన్ మరోసారి తన ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారని, సిఎం జగన్ పై తన అక్కసును, ద్వేషాన్ని ప్రదర్శించారని నాని మండిపడ్డారు. ఆయన ఓ వారాంతపు నాయకుడని అభివర్ణించారు. మైక్ ముందు నటనతో అందరినీ అలరించారన్నారు. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసమే జగన్ పై విమర్శలు చేశారని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికలు కీలకమని పవన్ అంటున్నారని…. ఆయనకు ప్రతి ఎన్నికలూ కీలకమేనని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఆయన తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లున్దన్నారు. బాబు అమరావతి ఉద్యమంతో 23 గ్రామాలకే పరిమితమైతే… పవన్ ఒక్క ఇప్పటం గ్రామానికే పరిమితమయ్యారని పేర్కొన్నారు. పవన్ రాకతో ఇప్పటంలో ఏం ఆగిందని సూటిగా అడిగారు.

మొన్న మోడీతో భేటీ అనంతరం పవన్ మాట్లాడుతూ ఎనిమిదేళ్ళ తరువాత ఆయన్ను కలుసుకున్నానని చెప్పారని, కానీ నేడు మాట్లాడుతూ వివిధ సందర్భాల్లో మూడు నాలుగుసార్లు ఆయన్ను కలుసుకున్నాని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు పేర్ని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular