Wednesday, June 17, 2026
HomeసినిమాPawan Kalyan - Sai Dharam Tej: పవన్, తేజ్ మూవీ టైటిల్ పై క్లారిటీ...

Pawan Kalyan – Sai Dharam Tej: పవన్, తేజ్ మూవీ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ఓ భారీ, క్రేజీ మూవీ రూపొందుతుంది. ఈ చిత్రాన్ని సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమాని ప్రారంభించిన చాలా తక్కువ టైమ్ లోనే షూటింగ్ దాదాపుగా పూర్తి చేశారు. ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఫస్ట్ టైమ్ మేనమామ, మేనల్లుడు పవన్, తేజ్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా పై భారీగా క్రేజ్ ఉంది.

అయితే… ఈ చిత్రానికి ‘దేవుడు’, ‘దేవుడే దిగివచ్చినా’.. అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆతర్వాత దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ ను కన్ ఫర్మ్ చేశారని గట్టిగా ప్రచారం జరిగింది. ఇందులో పవన్ దేవుడుగా నటించడం.. పై నుంచి క్రిందకు రావడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని.. అందుచేత ఈ టైటిల్ నే ఫిక్స్ చేసుంటారని అనుకున్నారు. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల పై మేకర్స్ స్పందించారు. ప్రచారంలో ఉన్నట్టుగా దేవుడే దిగి వచ్చినా..? అనే టైటిల్ ను ఖరారు చేయలేదన్నారు. ఇంకా కొన్ని టైటిల్స్ పరిశీలిస్తున్నామని… కన్ ఫర్మ్ అయిన తర్వాత అఫిషియల్ గా అనౌన్స్ చేస్తామన్నారు.

ప్రస్తుతం ‘ఓజీ’ షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ఈ మూవీ కోసం డేట్స్ ఇవ్వనున్నారు. మిగిలిన పాటను షూట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సాంగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు టైటిల్ ఏంటి అనేది ప్రకటిస్తారని తెలిసింది. అలాగే జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అందుచేత అతి త్వరలోనే ఈ మూవీ టైటిల్ ఏంటి ప్రకటించనున్నారని సమాచారం. మరి.. పవన్, తేజ్ కలిసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular