Tuesday, June 16, 2026
HomeసినిమాChandoo Mondeti - Chaitanya: చైతూ, చందూ కాంబో మూవీ ఫిక్స్..?

Chandoo Mondeti – Chaitanya: చైతూ, చందూ కాంబో మూవీ ఫిక్స్..?

నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్వకత్వం వహించారు. ఇందులో చైతన్యకు జంటగా కృతి శెట్టి నటించింది. తెలుగు, తమిళ్ లో రూపొందిన కస్టడీ చిత్రాన్ని మే 12న విడుదల చేస్తున్నారు. ఇందులో చైతన్య కానిస్టేబుల్ క్యారెక్టర్ చేయడం… ప్రియమణి కీలక పాత్ర పోషించడం.. అలాగే అరవింద్ స్వామి విలన్ గా నటించడంతో కస్టడీ మూవీ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా సక్సెస్ పై చైతూ చాలా నమ్మకం పెట్టుకున్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత చైతన్య ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ప్రకటించలేదు. తాజాగా చందూ మొండేటితో చైతన్య సినిమా కన్ ఫర్మ్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ‘కార్తికేయ 2’ తర్వాత చందూకు డిమాండ్ బాగా పెరిగింది. గీతా సంస్థలో ఓ సినిమా చేయాల్సివుంది. పెద్ద హీరోల కోసం ట్రై చేశారు కానీ.. ఎవరూ ఖాళీగా లేరు. తమిళ హీరో సూర్యకు కథ చెప్పాడు నచ్చింది కానీ.. ఆయన కూడా ఖాళీగా లేరు. వరుసగా మూడు సినిమాలకు ఓకే చెప్పాడు. అందుచేత సూర్యతో సినిమా చేయాలంటే కనీసం మూడు సంవత్సరాలు ఆగాల్సిందే.

అందుకనే ఈలోపు మరో సినిమా చేయాలి అనుకుంటున్నాడు. నిర్మాత బన్నీ వాసు ఈలోగా ఓ మాంచి కథ తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథతో ముందు ఓ సినిమా చేసి ఆతర్వాత పాన్ ఇండియా మూవీ చేయచ్చు అనేది బన్నీ వాసు ప్లాన్. ఈ కథతో నాగచైతన్యను ఒప్పించినట్లు సమాచారం. ఇంకా ఫైనల్ డిష్కషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ రిలీజ్ తర్వాత పూర్తి స్థాయిలో కథ విని అప్పుడు అనౌన్స్ చేస్తారని తెలిసింది. గతంలో గీతా సంస్థలో చైతన్య 100 పర్సంట్ లవ్ చేశారు. మంచి సక్సెస్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular