Saturday, January 18, 2025
HomeTrending Newsపవన్ విజయంపై 'మెగా' సంబరాలు

పవన్ విజయంపై ‘మెగా’ సంబరాలు

ఇటీవలి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని పురస్కరించుకొని విజయోత్సవ వేడుకలను ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఎన్డీయే పక్ష నేతల భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన పవన్ నేడు కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు, అనంతరం హైదరాబాద్ చేరుకొని నేరుగా చిరు నివాసానికి చేరుకున్నారు. ఆయనకు పూలవర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. పవన్ తల్లి అంజనమ్మ, వదిన సురేఖ, రామ్ చరణ్ లు ఎదురేగి పవన్ దంపతులకు, కుమారుడు అకీరా నందన్ ను సాదరంగా ఆహ్వానించారు. సురేఖ స్వయంగా పవన్ కు దిష్టి తీసి నుదుట తిలకం దిద్దారు. సోదరీమణులు హారతులు పట్టారు. అనంతరం చిరు ఓ భారీ పూలమాలతో పవన్ ను సత్కరించారు.  ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా పవన్ ను హత్తుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లి, అన్న వదినలకు పవన్ పాదాభివందనం చేశారు. చిరంజీవి పవన్ ను గాడంగా హత్తుకొని ముద్దాడారు.

తదుపరి కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి విజయోత్సవం చేసుకున్నారు. భారీ సంఖ్యలో మెగా అభిమానులు, జన సేన కార్యకర్తలు పవన్ రాక సందర్భంగా చిరు నివాసానికి వచ్చి టపాసులు కాలుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్