Sunday, January 19, 2025
HomeTrending Newsపవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభం

పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభం

Protest Against Privatization:
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ తలపెట్టిన ఒక్కరోజు దీక్ష ప్రారంభమైంది. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ‘విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్ష’ పేరుతో చేపట్టిన ఈ నిరసన సాయంత్రం 5 గంటల వరకూ జరగనుంది. నేటి ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న పవన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

పార్టీ కార్యాలయానికి వెళుతూ మార్గమధ్యంలో మంగళగిరి సమీపంలోని వడ్డేశ్వరం వద్ద సర్వీస్ రోడ్డు నుంచి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డులో ఏర్పడిన `గుంతలను పార్టీ శ్రేణులతో కలిసి శ్రమదానం ద్వారా బాగుచేసి అనంతరం అయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

దీక్షకు కూర్చునే ముందు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, మధులిత దంపతులతో పాటు అసువులు బాసిన సైనిక వీరులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్