Saturday, January 18, 2025
Homeసినిమాఓజీ, ఉస్తాద్ ప్లాన్ మారిందా..?

ఓజీ, ఉస్తాద్ ప్లాన్ మారిందా..?

పవన్ కళ్యాణ్ ముందుస్తు ఎన్నికలు వస్తాయని అనుకుని వారాహి యాత్రలు చేశారు. ఇప్పుడు ఎన్నికలు మార్చి తర్వాతే వస్తాయని క్లారిటీ వచ్చేసింది. అందుకనే పవన్ మళ్లీ సినిమాలకు డేట్స్ ఇచ్చారని సమాచారం. ఇప్పటి నుంచి మూడు నెలల పాటు షూటింగ్లోనే పాల్గొనాలని ప్లాన్ చేస్తున్నారట. ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ సినిమాల షూటింగ్ లో పాల్గొనాలి అనుకుంటున్నారట. అందుకనే ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ తాజా షెడ్యూల్ సెప్టెంబర్ 5 నుంచి స్టార్ట్ కానుందని ప్రకటించారు. అంతే కాకుండా.. ఇది లెంతీ షెడ్యూల్ అని కూడా ప్రకటించడం విశేషం.

ఈ మూవీ ఇప్పటి వరకు ఒక షెడ్యూలే జరిగింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారట. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వేసిన స్పెషల్ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్‌, శ్రీలీల మిగిలిన తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్నిఏమాత్రం రాజీపడకుండా నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి విడుదల చేయనున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.

మరో వైపు పవన్ స్టార్ ఓజీ షూటింగ్ లో కూడా జాయిన్ అవుతున్నారు. ఈ చిత్రానికి సుజిత్ డైరెక్టర్. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ సినిమా పై మరింతగా అంచనాలు పెంచేశాయి. థాయ్ లాండ్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన ఏప్రిల్ లేదా జూన్ లో రిలీజ్ చేయడానిఇకి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి పవర్ స్టార్ ఈ రెండు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్