Thursday, January 23, 2025
HomeTrending Newsపవన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: అడపా శేషు

పవన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: అడపా శేషు

ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పిన తరువాతే పవన్ కళ్యాన్ రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మాత్రమే మంత్రులు, వైసీపీ నేతలు స్పందించారని, దీన్ని  తెలంగాణ ప్రజల మనోభావాలు దేబ్బతీసినట్లు పవన్ వక్రీకరించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కులాలు, మతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టె పని అయిపోయిందని, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం మొదలు పెట్టారా అంటూ పవన్ ను ప్రశ్నించారు.  ఏపీలో చంద్రబాబు దగ్గర తీసుకున్నట్లు  తెలంగాణాలో కెసిఆర్ దగ్గర కూడా ప్యాకేజ్ తీసుకుని మాట్లాడుతున్నారా అంటూ ధ్వజమెత్తారు. ఏబీఎన్ రాధాకృష్ణ చెప్పిన మాటలు నిజమేనా అంటూ పవన్ ను సూటిగా నిలదీశారు.

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందించి వారి అభిమానాన్ని చూరగోనేవాడే నాయకుడు అవుతాడని, కానీ ఎప్పుడో నెలకు, వారానికి వచ్చి ఏవో వ్యాఖ్యలు చేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టె రకం మా పార్టీ నేతలు కారని స్పష్టం చేశారు. బ్రోకర్ మాటలు మాట్లాడవద్దని, పరిణితి చెందిన రాజకీయ నేతగా మాట్లాడాలని పవన్ కు శేషు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్