Monday, June 8, 2026
HomeTrending Newsబాబు సంస్కార హీనుడు: పెద్దిరెడ్డి ధ్వజం

బాబు సంస్కార హీనుడు: పెద్దిరెడ్డి ధ్వజం

Fire on Babu: కుప్పంలో చంద్రబాబు పోటీ చేసే  పరిస్థితి లేదని, అందుకే ఆయన భయపడుతున్నారని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయ్యిందని, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా వైసీపీనే ప్రజలు గెలిపించబోతున్నారని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలో 80శాతంపైగా స్థానిక సంస్థల్లో తమ పార్టీ విజయం సాధించిందని చెప్పారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ ప్లీనరీ ప్రాంగణంలో వివిధ మీడియా చానళ్లతో మాట్లాడుతూ నిన్నటి మదనపల్లె మినీ మహానాడులో చంద్రబాబు తనపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు.  అవినీతి అనేది తనకు తెలియదని, ఈ విషయం జిల్లాలో ఉన్న టిడిపి నేతలకు కూడా తెలుసనీ, రాజకీయాల్లో ఉండాలంటే ఏదో ఒక ఆదాయ వనరు ఉండాలి కాబట్టి తాను కాంట్రాక్టులు చేస్తుంటానని, ఆయన హయంలో కూడా తాము పనులు చేశామని వెల్లడించారు.

తాను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కుప్పంలో బాబుకు ఎప్పుడూ మెజార్టీ రాలేదని, అందుకే తనపై ఎప్పుడూ విమర్శలు చేస్తుంటారని పెద్దిరెడ్డి అన్నారు. పుంగనూరు ఏ జిల్లాలో ఉండాలన్నది ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమని దీనిపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియంపై బాబు చేసిన వ్యాఖ్యలను పెద్దిరెడ్డి తపుబట్టారు. చంద్రబాబు ఇంగ్లీష్ మాట్లాడే విధానం చూస్తే ఎవరికైనా అయన విజ్ఞానం ఏమిటో అర్ధమవుతుందని, అయన లాగే భావి తరాలు కూడా ఉండాలా అని ప్రశ్నించారు. పోటీ పరీక్షలు రాయాలంటే తెలుగు మీడియంలో రాస్తామా, ఇంగ్లీష్ మీడియంలో రాస్తామా అని నిలదీసిన పెద్దిరెడ్డి,  విద్యారంగంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా వక్ర భాష్యం చెప్పడం దారుణమన్నారు. బాబు సంస్కార హీనుడని అతనిపై తాను పెద్దగా మాట్లాడబోనన్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular