Monday, January 20, 2025
HomeTrending Newsమూడుకే కట్టుబడి ఉన్నాం : పెద్దిరెడ్డి

మూడుకే కట్టుబడి ఉన్నాం : పెద్దిరెడ్డి

We are for 3 capitals:
ఎట్టి పరిస్థితిల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.  త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని వెల్లడించారు. అమరావతి ఉద్యమం రైతుల ఉద్యమం కాదని,  తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడుస్తున్న ఉద్యమమని విమర్శించారు.  నైతిక విలువల్లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని ఎద్దేవా చేశారు. తోక పార్టీలను వెంటేసుకొని చంద్రబాబు అబద్దాలాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.  చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వామపక్షాలు, కాంగ్రెస్, బిజెపి ఒకే వేదికపైకి వచ్చాయని దీని అర్ధమేమిటని నిలదీశారు.

సిఎం జగన్ ను పదవినుంచి దించాలనే ఏకైక లక్ష్యంతోనే అనైతికంగా పొత్తులు పెట్టుకునెందుకు సిద్ధమయ్యారని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. కోర్టు ఒకే రాజధానికి అనుకూలంగా తీర్పు ఇస్తుందని చంద్రబాబు చెబుతున్నారని, అంటే  కోర్టు తీర్పులను కూడా ముందుగానే చెబుతున్నాడంటే ఏ స్థాయిలో వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నాడో వేరే చెప్పనక్కర్లేదని ఎద్దేవా చేశారు. వైసిపిలో ఎంగిలి కూడు తిన్న నాయకులు ఇప్పుడు జగన్ ను విమర్శిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.  రఘురామకృష్ణంరాజు చంద్రబాబుతో జతకలిసి అబద్దాలు ప్రచారం చేస్తున్నాడని పెద్దిరెడ్డి విమర్శించారు.  ఇవాళ చంద్రబాబు వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రయోజనాల కంటే అమరావతి భూ సమస్యే ఎక్కువగా కనిపించిందన్నారు.

Also Read : అమరావతిని కాపాడుకుందాం: బాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్