Saturday, January 18, 2025
HomeTrending Newsబాబుకు ఊడిగం చెయ్‌... మాకేంటి: పేర్ని ఫైర్

బాబుకు ఊడిగం చెయ్‌… మాకేంటి: పేర్ని ఫైర్

టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు వాళ్ల పంపకాలకి సంజాయిషీ చెప్పుకునేందుకు జెండా పేరుతో నిన్నటి సభ పెట్టారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. జెండా సభ అనే కంటే జెండాల సభ అనాలని, రెండు జెండాల సభ అని…మూడో జెండా కోసం ఎదురుచూస్తున్న సభ అని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు.

  • మూడో జెండా కోసం ఖాళీ కుర్చీ అట్టిపెట్టిన సభ అది.
  • ఆ సభలో కేవలం జగన్నామ స్మరణ తప్ప వారికెందుకు ప్రజలు ఓటేయాలి.. వారిద్దరి జెండాలు మోస్తున్న కార్యకర్తలు ప్రజలకు పొత్తులపై ఏమని చెప్పాలి అనే దిశానిర్ధేశం చేశారా?
  • వారికి అధికారం ఇస్తే ఏం చేయబోతున్నారనేది ప్రజలకు ఏమైనా సందేశం ఇచ్చారా?
  • ప్రజల క్షేమం, ఈ రాష్ట్ర క్షేమం గురించి ఊసే ఎత్తలేదు.
  • వీళ్లిద్దరికీ అధికారం కావాలట..ప్రజలకు మేలు చేయడానికి మాత్రం కాదట.
  • జగన్‌ని, ఆయనతో ఉండేవాళ్లపై దాడులు చేయడానికి వీళ్లకి అధికారం కావాలట.
  • ఇదీ జెండాల సభ ద్వారా వారిచ్చిన సందేశం
  • కనీసం 2014–19లో వీరిద్దరి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏం చేశారనేది కూడా చెప్పుకోలేకపోయారు.
  • ఈ రాష్ట్రంలో పవన్‌కి, చంద్రబాబుకు ఐదేళ్లు అధికారం ఇస్తే ఒక్కటంటే ఒక్కటి వారు చేసిన మేలు చెప్పలేకపోయారు.
  • పోనీ కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాటన్నా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చెప్పారా?
  • కాపుల ఓట్లు కావాలి.. కాపులు టీడీపీ జెండా మాత్రం మోయాలని చెప్తున్నారు.
  • ఆత్మాభిమానం చంపుకుని టీడీపీ జెండా మోయమని మాత్రం ఇద్దరూ కలిసి చెప్తున్నారు.
  • జెండా మోసే వారి ఆత్మస్థైర్యాన్ని కించపరిచే నాయకుడు ఈ ప్రపంచంలో ఒక్క పవన్‌ కల్యాణ్‌ మాత్రమే.
  • నువ్వు 24 సీట్లు కూడా తీసుకోవద్దు. ఏమీ తీసుకోకుండా చంద్రబాబుకు ఊడిగం చెయ్‌.
  • మాకేంటి..నువ్వు సమాధానం చెప్పుకోవాల్సింది నిన్ను ప్రశ్నించే, అభిమానించే, నీ హితవు కోరే వారికి మాత్రమే.
  • నువ్వు, చంద్రబాబు కలిసి పరిపాలన చేసినప్పుడు కూడా రోడ్లపై పోసిన పాలను ఎత్తుకుని టీ, కాఫీ కాసుకుని తాగేవారు కదా?
  • ఈ రాష్ట్రంలో పేదరికం పోగొట్టడానికి ఏకైక మార్గం విద్య అనే ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న జగన్‌గారిని మరో పదికాలాలు పాటు మనం కాపాడుకుంటేనే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పేదరికం పోతుంది.
  • అనారోగ్యం వస్తే అప్పుల బారిన పడకుండా జగన్‌ గారు చేస్తున్న ప్రయత్నాన్ని ఒకసారి గమనించండి.
  • మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ చచ్చే లోపు ఒక్కరోజైనా సొంతింట్లో బతికి చావాలి అనుకునే తీరని కోర్కెను తీర్చే ప్రయత్నం చేసినవాడు జగన్‌ గారు.
  • మీ ఇంట్లో మంచి జరిగితేనే మరొక్కసారి తన గురించి మంచి మాట పక్కవాడికి చెప్పమనే జగన్‌ గారు కావాలా?
  • ఏం మంచి చేశారో, ఏం చేస్తారో చెప్పకుండా, వారి పాలన గురించి ఒక మంచి మాట కూడా చెప్పుకోలేని వారిద్దరు జగన్‌ గారిపై విషం చిమ్ముతూ పెత్తందార్ల పక్షాన భుజం కాస్తున్న వారి మాటలు నమ్ముతారా
  • ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని పేర్ని నాని విజ్ఞప్తి చేశారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్