Saturday, January 18, 2025
HomeTrending Newsమానవాళి శత్రువులు పావురాలు

మానవాళి శత్రువులు పావురాలు

Pigeons :  మీ ఇంటి కిటికి , టాయిలెట్ exhaust ఫ్యాన్ లాంటి వాటి వద్ద పావురాలు ఉన్నాయా ? అయితే మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే. పావురాల రెట్టల వల్ల ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది ప్రాణాంతకం కావొచ్చు. పావురాల రెట్ట ఎక్కువగా పోగు అయితే ఆ ప్రాంతంలో శ్వాస సంబంధమైన వ్యాదులు తీవ్రంగా ప్రబలుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని అనేక నగరాల్లో పావురాల సంతతి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో వాటికి దాణా వేయటం వాటి సంతతి మరింత పెరిగేందుకు దోహదం చేస్తోంది.

నటి మీనా భర్త విషయం లో ఇదే జరిగింది. ఆయనకు పావురాల రెట్టల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఊపిరితిత్తులు దెబ్బ తిన్నాయి. ఇంట్లో అందరికీ వచ్చినట్టే ఆయనకు కరోనా సోకింది. ఇది వరకే దెబ్బ తిన్న ఆయన ఊపిరి తిత్తులు దాని నుంచి కోలుకోలేక పోయాయి. అయన మరణానికి కారణం పావురాల రెట్టల వల్ల వచ్చిన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. వాస్తవం తెలుసుకోండి. పావురాల రెట్టల్లో హిస్టాప్లాస్మా అనే ఫంగస్ ఉంటుంది. దీని వల్ల హిస్టాప్లాస్మోసిస్ అనే lung ఇన్ఫెక్షన్ వస్తుంది.

పావురాల రెట్టలు

పావురాలు సమస్యగా ఎలా మారాయి ?:

1. పావురాలు చెట్లు లేకపోయినా ఇళ్ల కిటికీ లు మొదలయిన వాటి పై బతికే గలవు . పావురాలు ప్రధానంగా నగర పక్షులు.

2. పావురాల సంఖ్య నెలకు ఇరవై శాతం చొప్పున పెరుగుతోంది. వీటి సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల కోయిల, కాకి, మైనా లాంటీ ఇతర పక్షుల ఆహారానికి కొరత ఏర్పడుతోంది.

౩. పావురాలకు ఆహారం అందిస్తే తమ సిరిసంపదలు పెరుగుతాయని, చేసిన పాపాలు పరిహారం అవుతాయనే నమ్మకం వల్ల వీటికి ఆహారం అందించడం ఎక్కువుగా కన్పిస్తోంది. ఇదే వాటి సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం.

4 . ప్రకృతిలో వివిధ జాతుల మధ్య సమతుల్యత లేక పోతే విపరిణామాలు ఏర్పడుతాయి. అడవిలో సింహం లాంటి మాంసాహార జంతువులు అంతరించిపోతే జింకల సంతతి విపరీతంగా పెరిగి వాటికి ఆహార కొరత ఏరపడే అవకాశం ఉంది. పక్షుల్ని వేటాడే పక్షులు గద్ద , శిక్ర లాంటి వేట పక్షులు గతంలో పావురాలను వేటాడి తినేవి. నగరాల్లో చెట్ల సంఖ్య బాగా తగ్గిపోవడంతో ఈ వేట పక్షుల సంఖ్య బాగా తగ్గిపోయింది. పావురాల సంఖ్య బాగా పెరిగిపోవడానికి ఇది మరో కారణం .

5 . ఒకప్పుడు పాడుబడిన కట్టడాలకే పరిమితం అయిన పావురాలు ఇప్పుడు తమ సంఖ్య పెంచుకొని మానవ ఆవాసాలకు వచ్చేసాయి . అపార్ట్మెంట్ లు ఇండిపెండెంట్ ఇల్లు వీటి నివాసాలుగా మారి పోయాయాయి. కిటికీ సందులు ఏగాక్స్ట్ ఫ్యాన్ సందులు ఇప్పుడు వీటి నివాసాలు.

6 . పావురాల రెట్టలు అసిడిక్ గుణాన్ని కలిగివుంటాయి. వీటి రెట్టలు, ఈకెలు{ కంటికి కనిపించని ఈకెలు } విషంతో సమానం. వీటిని ముట్టుకోవడం లేదా గాలి పీల్చడం వల్ల రకరకాల శ్వాస కోస సమస్యలు వస్తాయి. నగర వాసుల్లో ఆస్తమా ఇంకా ఇతర ఎలర్జీలు ఇటీవలి కాలంలో బాగా పెరగడానికి ఇది ఒక ముఖ్య కారణం. { వాయు కాలుష్యం , సిగరెట్లు కూడా ప్రధాన కారణాలు }.

7 . పావురాల రెట్టల్లో ఒక రకమైన ఫంగస్ ఉంటుంది. అది మానవ శరీరం లోకి ప్రవేశిస్తే ప్రమాదకరంగా మారవచ్చు. ఒక వ్యక్తి ఇమ్మ్యూనిటి బలంగా ఉంటే శరీరంలోకి వచ్చిన ఫంగస్ ను ఇమ్మ్యూనిటి కణాలు చంపేస్తాయి. అదే ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉంటే ఆ ఫంగస్ విజృంభించి ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది. సినీ నటి మీనా భర్త విషయంలో జరిగింది ఇదే. వారి ఇంటిలో పావురాలు ఎక్కువగా ఉండేవి. దీనితో ఆయనకు ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చింది. అటుపై కోవిద్ సోకడంతో అసలే బలహీనంగా ఉన్న ఊపిరి తిత్తులు కోలుకోలేక పోయాయి.

8 . హైదరాబాద్, అహమ్మదాబాద్ లాంటి కొన్ని నగరాల్లో కొన్ని చోట్ల పావురాలు పెద్ద ఎత్తున కనిపిస్తాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో ఎలర్జీ లు ఆస్తమాలు ఎక్కువగా కనిపించడం గమనార్హం. ఎలర్జీ లు వెంటనే చంపవు. బతికుండగానే నరకాన్ని చూపిస్తాయి. ఇవి మొండి వ్యాధులు. ఒకసారి వస్తే అంత సులభంగా పోవు. అంటి హిస్టమిన్ లాంటి ఎలర్జీ మందుల బిజినెస్ ఏటేటా పెరిగిపోతోంది. ఇవి తింటే తాత్కాలిక ఉపశమనం మాత్రమే.

9 . ఇమ్మ్యూనిటి ని పెంచుకోవడం , కాలుష్యానికి, పావురాలు , గబ్బిలాలు లాంటి వాటికి దూరంగా ఉండడం ఈ సమస్యకు సరైన పరిష్కారం.

10 .శాంతి కపోతాలు .. నిజమే .. కానీ వాటికి డబ్బు పెట్టి మరీ గింజెలు కొని ఆహారం అందించొద్దు . మీరు చేసిన పని వల్ల ఒక చంటి బిడ్డ ఎలర్జీ కి లోను కావొచ్చు. ఇమ్యూనిటీ బలహీనముగా ఉన్న ఒక వ్యక్తికి ఊపిరి తిత్తులు పాడైపోవచ్చు. ఆ పాపం మీకు చుట్టుకొంటుంది. మనిషి ఎక్కడ వేలు పెట్టినా సమస్యలే. కోతులు అడవుల్లో హ్యాపీగా బతికేవి. చెట్లు నరకడం ఒక పక్క .. దీనికి తోడు కోతులకు ఆహారం అందించడం .. మీరు నల్లమల అడవుల గుండా పయనిస్తే అక్కడ రోడ్ ల పై గుంపులు గుంపులుగా కోతులు ఎవరు కారు ఆపి ఆహారం అందిస్తారా అని ఎదురు చూస్తుంటాయి. అంటే అవి తమ సహజ సిద్దమైన ఆహారం సేకరణను మానేశాయి. మనం పెట్టే ఆహారం వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. పరిస్థితి ఎక్కడి దాక వెళ్లిందంటే నగరాల్లో { ఉదాహరణకు హైదరాబాద్ లో గాంధీ నగర్ లాంటి చోట్ల } కోతులు స్వైర విహారం చేస్తాయి. ఇళ్లలోకి దౌర్జన్యంగా ప్రవేశించి వస్తువులను చిందర వందర చేసి ఆస్తి నష్టాన్ని కలిగిస్తాయి.

దోమలు , కోతులు , పావురాలు .. ఆధునిక నగర జీవనానికి అనుసరణ పొందాయి. తగిన చర్యలు తీసుకోకపోతే వీటి వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి.
– వాసిరెడ్డి అమర్నాథ్

Also Read : నటి మీనా భర్త హఠాన్మరణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్