Wednesday, May 7, 2025
HomeTrending Newsమరో మూడు కేసుల్లోనూ పిన్నెల్లికి ఊరట

మరో మూడు కేసుల్లోనూ పిన్నెల్లికి ఊరట

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి ఏపీ హైకోర్టు ఊరట కలిగించింది. ఆయనపై దాఖలైన మరో మూడు కేసుల్లో కూడా మధ్యంతర బెయిల్  మంజూరు చేసింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.

మే 13న ఎన్నికల పోలింగ్ రోజున పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో    ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఆయనపై ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు దాదాపు 10 సెక్షన్లకింద ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిదే. ఈ కేసులో పిన్నెల్లి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఆయనపై ఎలాంటి చర్యలకూ దిగవద్దని ఆదేశించింది.

అనంతరం పిన్నెల్లిపై…..

  • ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకున్న నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి ఆయనపై హత్యా యత్నానికి పాల్పడ్డారని….
  • అదే సందర్భంలో తనను ప్రశ్నించిన మహిళపై దుర్భాషలాడారని…
  • కారంపూడిలో సీఐపై దాడికి పాల్పడ్డారంటూ మరో మూడు కేసులు నమోదయ్యాయి.

ఈ మూడు కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా  విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విని తీర్పును నేటికి వాయిదా వేసిన సంగతి విదితమే.

ఈవిఎం ధ్వంసం కేసులో మాదిరిగానే ఈ మూడు కేసుల్లో కూడా పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఆ కేసులో విధించిన షరతులే దీనికి వర్తించనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్