ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఈ ఏడాది ఎండాకాలంలో అమెరికా పర్యటనకు రావాల్సిందిగా మోడీని బైడెన్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బైడెన్ ఆహ్వానాన్ని పీఎంవో కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మోదీ అమెరికా పర్యటన తేదీల విషయంలో ఇరు దేశాల నేతలు కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం వైట్ హౌస్‌లో జరగనున్న విందులో కూడా పాల్గొంటారు. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. 2021 సెప్టెంబరు నెలలో ప్రధానమంత్రి వాషింగ్టన్‌లో పర్యటించారు. ఆ సమయంలో మోడీ.. బైడెన్‌తో తన తొలి ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కనుక : మోడీ