PM Modi review on Floods:
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆరా తీశారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రధానికి వివరించారు. వరద ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. సహాయ కార్యక్రమాల కోసం నేవీ హెలికాప్టర్లు వినియోగించుకుంటున్నామని ఆయన ప్రధానికి తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో కేంద్రం పూర్తి అండగా ఉంటుందని, ఏ సహాయం కావాలన్నా కోరాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సీఎంకు హామీ చెప్పారు.
రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకునే ముఖ్యమంత్రి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. ఏరియల్ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకొని, అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు. ఏరియల్ సర్వేకు బయలుదేరే ముందు జగన్ ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తారు.
Also Read : వర్షాలకు తిరుమల తిరుపతి అస్తవ్యస్తం