PM Modi Declared That Agricultural Laws Will Be Repealed :
మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. ఈ నెలాఖరులో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో శాసన ప్రక్రియ ద్వారా ఈ చట్టాల రద్దు చేస్తామని వెల్లడించారు. ప్రధాని నేడు జాతినుద్దేశించి ప్రసంగించారు. గురునానక్ జయంతి సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ప్రధాని ఇచ్చిన సందేశంలో ముఖ్యాంశాలు:
రైతుల ప్రయోజనాల కోసమే మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చాం
ఈ చట్టాలను సమర్ధించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు
ఈ చట్టాలపై కొందరు రైతులు ఆందోళన చేస్తున్నారు
రైతుల ఆవేదనను నేను అర్ధం చేసుకున్నా
వ్యవసాయ చటాలు రద్దు చేస్తున్నాం
రైతుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం
రైతులు ఆందోళనలు విరమించాలి
తమ తమ ప్రాంతాలకు వెళ్లి, పొలాల్లోకి వెళ్లి వ్యవసాయం చేసుకోవాలి
రైతుల కష్టాలు నేను దగ్గరినుంచి చూశా
తాము అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం
నాణ్యత కలిగిన విత్తనాలు, ఎరువులను రైతులకు అందిస్తున్నాం
పంట నష్ట పరిహారాన్ని రైతులు ఎంతో సులభంగా పొందగలుగుతున్నారు
ఇప్పటివరకు లక్ష కోట్ల రూపాయలను రైతులకు నష్ట పరిహారంగా ఇచ్చాం
దేశంలో చాలా మంది రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది
దేశంలో 80 శాతం మంది చిన్న తరహా రైతులే
తర తరాలుగా రైతులు తమ భూమిని కోల్పోతూ వస్తున్నారు
చిన్న సన్న కారు రైతులకు అండగా ఉంటున్నాం
దేశవ్యాప్తంగా రైతులందరికీ ఇప్పుడు మద్దతు ధర లభిస్తోంది
గ్రామీణ మార్కెట్లను బలోపేతం చేశాం
రైతు సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత
Also Read : రైతులను రోడ్లు ఎక్కించిన ఘనత బిజెపి దే