Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్కొత్త భారతావనికి ప్రతిబింబం మీరు : మోడీ

కొత్త భారతావనికి ప్రతిబింబం మీరు : మోడీ

మన అథ్లెట్లు సరికొత్త భారతావని ప్రతిబింబంగా, మనదేశ భవిష్యత్తుకు ప్రతీకగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు.   టోక్యో ఒలింపిక్స్ లో మనదేశం తరఫున పాల్గొంటున్న అథ్లెట్లతో  మోడీ వర్చువల్ గా సమావేశమయ్యారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు, విజయాలతో తిరిగి రావాలని ఆకాంక్షిం చారు. అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపి వారితో ముచ్చటించారు. వారిలో స్ఫూర్తి నింపారు. సీనియర్ క్రీడాకారులు మేరీ కొమ్, పి.వి. సింధులతో మోడి ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఈ ముఖాముఖి లో పాల్గొన్నారు.

జాతి యావత్తూ మీ వెంట నిలుస్తుందని, విశ్వ క్రీడా సంబరాల్లో మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలని   అన్నారు. కోవిడ్ కారణంగా మీ అందరికీ విందు ఇవ్వలేకపోయానని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారి అథ్లెట్ల కఠోర శిక్షణకు కూడా అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మన దేశం నుంచి మొత్తం 126 మంది అథ్లెట్లు జూలై23 నుంచి జపాన్ లోని టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో 18  రకాల క్రీడాంశాల్లో 69 విభాగాల్లో తమ సత్తా చాటేందుకు సమాయాత్తమవుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్