Sunday, February 23, 2025
HomeTrending Newsవెనకబడ్డ జిల్లాల్లో అభివృద్ధిపై పిఎం సమీక్ష

వెనకబడ్డ జిల్లాల్లో అభివృద్ధిపై పిఎం సమీక్ష

PM Modi Review: దేశవ్యాప్తంగా వెనకబడ్డ జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ది  కార్యక్రమాలపైపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు తదితరులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు.

వివిధ అంశాల్లో ప్రగతిపై నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తమ తమ జిల్లాల్లో ప్రగతిని వివిధ జిల్లాల కలెక్టర్లు ఈ కాన్ఫరెన్స్ లో వివరించారు.

క్యాంప్‌ కార్యాలయం నుంచి వీసీలో సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, అటవీ,పర్యావరణం,సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ టి విజయ్‌కుమార్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : కమిటీ ఏర్పాటు చేయలేదు: పేర్ని నాని

RELATED ARTICLES

Most Popular

న్యూస్