Saturday, January 18, 2025
HomeTrending Newsవిశాఖలో మోడీ రోడ్ షో : జీవీఎల్

విశాఖలో మోడీ రోడ్ షో : జీవీఎల్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పర్యటన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహిస్తున్నట్లు  ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. 11వ తేదీ మధురై నుంచి సాయంత్రం ఏడున్నర సమయానికి విశాఖ నేవల్ ఎయిర్ బేస్ విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని.. కంచర్లపాలెం నుంచి ఓల్డ్ ఐటీఏ జంక్షన్ వరకూ కిలోమీటర్ పైగా బిజెపి నిర్వహించే జరిగే  రోడ్ షో లో ఆయన పాల్గొంటారని వివరించారు.  బిజెపి కార్యకర్తలు, విశాఖ వాసులు పెద్ద సంఖ్యలో ఈ షో లో పాల్గొనాలని జీవీఎల్ విజ్ఞప్తి చేశారు. రోడ్ షో అనంతరం బిజెపి సీనియర్ నేతలను ప్రధాని కలుసుకుంటారని చెప్పారు.

మర్నాడు 12 వ తేదీ ఉదయం ఏయూ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన, చేపట్టనున్న 9 ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుడతారని చెప్పారు.  దాదాపు 15, 200 కోట్ల రూపాయల ప్రాజెక్టుల్లో పూర్తయిన వాటిని జాతికి అంకితం చేయడం, మరికొన్నింటికి శంఖుస్థాపన చేయబోతున్నారని తెలిపారు.

ఈ ప్రాజెక్టుల వివరాలు…

  • రూ. 152 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ
  • రూ. 3778 కోట్లతో విశాఖపట్నం – రాయపూర్ ఎకనామిక్ కారిడార్
  • రూ.466 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్‌ రీ డెవలప్మెంట్
  • 566 కోట్ల రూపాయలతో కాన్వెంట్ జంక్షన్ – షీలా నగర్ రోడ్
  • రూ. 2658 కోట్లతో శ్రీకాకుళం నుంచి అంగుల్ ప్రాంతానికి 321 కిలోమీటర్ల పైప్ లైన్
  • ఓఎన్జిసి ద్వారా రూ. 2917 కోట్లతో పెట్రోలియం రంగంలో నిర్మాణాలు
  • రూ. 4106 కోట్లతో… విజయవాడ-నర్సాపూర్- గుడివాడ-మచిలీపట్నం- భీమడోలు- నిదదదవోలు రైల్వే లైన్, విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు
  • రూ. 211 కోట్లతో పాతపట్నం- ఇచ్చాపురం- పర్లాకిమిడి హై వే
  • ఐఓసిఎల్ ద్వారా రూ. 385 కోట్లతో నిర్మితమైన  గుంతకల్ లో ఎల్పీజీ స్టోరేజ్ ప్రాజెక్టు

రాష్ట్రంలో వివిధ రైల్వే లైన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలని, దీనిపై సిఎం జగన్ ఓ స్పష్టత ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. విశాఖ బిజెపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జీవేఎల్ తో పాటు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ప్రధాని మోడీ విశాఖ టూర్ ఖరారు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్