Saturday, January 18, 2025
HomeTrending Newsనేడు కేంద్ర క్యాబినెట్ విస్తరణ

నేడు కేంద్ర క్యాబినెట్ విస్తరణ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని ఈ సాయంత్రం విస్తరించనున్నారు. కొత్తగా దాదాపు 20 మంది వరకూ తన జట్టులోకి చేర్చుకోనున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనబడుతున్నాయి.  సాయంత్రం ఆరు గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మంత్రివర్గ కూర్పుపై మోడీ ఇప్పటికే హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా లతో వరుస భేటీలు నిర్వహించారు. మరికాసేపట్లో కొత్త మంత్రుల జాబితాను రాష్ట్రపతి  భవన్ విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త మంత్రులుగా వీరి పేర్లు ఖరారయినట్లు తెలిసింది.

  1. జ్యోతిరాదిత్య సింధియా(మధ్య ప్రదేశ్)
  2. సర్బానంద సోనోవాల్ ( అస్సాం)
  3. నారాయణ రాణే (మహారాష్ట్ర)
  4. అనుప్రియా పటేల్ (ఉత్తర్ ప్రదేశ్ )
  5. పంకజ్ చౌధురి (ఉత్తర్ ప్రదేశ్)
  6. రీటా బహుగుణ జోషి (ఉత్తర్ ప్రదేశ్)
  7. రామశంకర్ కథేరియా (ఉత్తర్ ప్రదేశ్)
  8. జితిన్ ప్రసాద్ (ఉత్తర్ ప్రదేశ్)
  9. వరుణ్ గాంధీ (ఉత్తర్ ప్రదేశ్)
  10. పశుపతి పారస్ (బీహార్)
  11. ఆర్.సి.పి. సింగ్ (బీహార్)
  12. లల్లన్ సింగ్ (బీహార్)
  13. రాహుల్ కశ్వన్ (రాజస్థాన్)
  14. చంద్ర ప్రకాష్ జోషి (రాజస్థాన్)
  15. వైజయంత్ పాండా (ఒడిస్సా)
  16. కైలశ్ విజయవర్గీయ (మధ్యప్రదేశ్)
  17. దినేష్ త్రివేది (వెస్ట్ బెంగాల్)
RELATED ARTICLES

Most Popular

న్యూస్