Monday, May 20, 2024
HomeTrending Newsరైతు భరోసా చైతన్యయాత్రలు

రైతు భరోసా చైతన్యయాత్రలు

జూలై 8న రైతు దినోత్సవం, జూలై 9 నుంచి 23 వరకూ రైతు భరోసా చైతన్యయాత్రలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ, అనుబంధ విభాగాల సిబ్బంది, కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులతో కలిసి ఆర్బీకేల విధివిధానాలు, సీఎం యాప్‌ పనితీరు, ఇ– క్రాపింగ్‌ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కలిగించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై క్యాంప్‌ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ కోవిడ్‌ తగ్గుముఖం పట్టగానే తాను కూడా వారానికి రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తానని చెప్పారు. ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి మండలస్థాయిలో ప్రతిరోజు ఒక గ్రామ,  వార్డు సచివాలయాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌ సమస్యలు, ఇతర సమస్యలపై దృష్టిపెట్టడానికి గ్రామ సచివాలయాల సందర్శన ఉపయోగపడుతుందన్నారు. ఈ లోపల అధికారులు గ్రామ, వార్డు సచివాలయాలను అనుకున్న షెడ్యూల్‌  ప్రకారం సందర్శించాలని ఆదేశించారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలగాలన్నారు. ప్రజలు లేవనెత్తిన సమస్యలు పెండింగులో లేవన్న మాట మాత్రమే వినిపించాలన్నారు.

రేపటి నుంచి అధికారులు చురుగ్గా గ్రామ,  వార్డు సచివాలయాలకు వెళ్లాలని, సిఏంఓ లో  నలుగురు కార్యదర్శులు దీన్ని పర్యవేక్షిస్తారని జగన్ పేర్కొన్నారు.  అదే సమయంలో ఆ గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో హౌసింగ్‌ కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని నిర్దేశించారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌పైనా దృష్టి పెట్టాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్