విలేజ్ టూరిజం పై తెలంగాణ పల్లెకు మరోసారి అంతర్జాతీయ ఘనత దక్కింది, ఇంటర్నేషనల్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్- ఆఫ్రికా తరపున సిల్వర్ అవార్డు ను దూలం సత్యనారాయణ దక్కించుకున్నారు.
దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్రికాలో ‘పోచంపల్లి – విలేజ్ టూరిజం’ డాక్యుమెంటరీ రజత పతకం సాధించింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ వేడుకలో ఈ డాక్యుమెంటరీని రూపొందించిన దూలం సత్యనారాయణ తరపున రాష్ట్రం నుంచి ఈ వేడుకలకు హాజరైన నాగరాజు గుర్రాల… ITFFA సహ వ్యవస్థాపక డైరెక్టర్ జేమ్స్ బైర్నే చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
గుర్రాల నాగరాజు మాట్లాడుతూ ‘దూలం సత్యనారాయణకు లభించిన గుర్తింపు సాంస్కృతిక ప్రాముఖ్యతకు ఉదాహరణగా నిలిచిందని, తెలంగాణ -అంతర్జాతీయ చలనచిత్ర సమాజం మధ్య బలమైన సంబంధాలను బలోపేతం చేసిందని చెప్పారు. దూలం కి ఎన్నారైలందరి తరపున అభినందనలు తెలిపారు, అవార్డు ని తెలంగాణ తరపున తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక శాఖ అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సిఎం కెసిఆర్, పర్యాటక శాఖ మంత్రి మార్గదర్శకత్వంలో నిర్మాతలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తూ పర్యాటకాన్ని ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పారు.