Saturday, April 20, 2024
HomeTrending Newsపోలవరం అథారిటీకి తెలంగాణ లేఖ

పోలవరం అథారిటీకి తెలంగాణ లేఖ

పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సమస్యలను ప్రస్తావించింది. పోలవరం బ్యాక్ వాటర్స్‌పై అధ్యయనం చేయాలని, బ్యాక్ వాటర్‌ ప్రభావంపై స్వతంత్రసంస్థ ద్వారా అధ్యయనం చేయాలని లేఖలో కోరింది. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి బ్యాక్‌వాటర్స్ ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం.

ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటినిల్వ ఉంటే ముంపు ఎక్కువ ఉంటుందన్న రాష్ట్ర ప్రభుత్వం ముర్రేడువాగు, కిన్నెరసాని నదుల పరిసరాలు మునుగుతాయని.. దీంతో అపారనష్టం సంభవిస్తుందని పేర్కొంది. రక్షణ కట్టడాలు నిర్మించి నివారణ చర్యలు చేపట్టాలని కోరిన నీటిపారుదల శాఖ బ్యాక్‌వాటర్‌తో ఏర్పడే ముంపును నివారించాలని సూచించింది. నష్ట నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విన్న్ననవించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్