రికార్డు స్థాయి ధరల పెరుగుదల, నిరుద్యోగ అంశాలపై దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ క్యాడర్ కు ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 5వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలకు ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు…రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ భవన్ వరకు ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించిన ఏఐసీసీ. జిల్లాల స్థాయిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని ఈ సందర్భంగా కలెక్టరేట్ ల ముట్టడి చేయాలని నాయకత్వం పేర్కొంది.

రాష్ట్ర రాజధానుల్లో పిసిసి ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి నిర్వహించి ప్రభుత్వ దమన వైఖరి ఎండగట్టాలని ఏఐసీసీ కోరింది. రాజ్ భవన్ ముట్టడిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్స్ ఎంపీలు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు పాల్గొంటారు. దేశ రాజధానిలో చలో రాష్ట్రపతి భవన్ కార్యక్రమంలో పాల్గొననున్న లోక్సభ రాజ్యసభ ఎంపీలు. ప్రధానమంత్రి ఇంటి ముట్టడిలో సిడబ్ల్యుసి మెంబర్లు జాతీయ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *