Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణలో పోలీస్ జులుం - రేవంత్ రెడ్డి

తెలంగాణలో పోలీస్ జులుం – రేవంత్ రెడ్డి

Police Harassment :  ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత దిగజారి తెలంగాణ ఏర్పాటును అవమానించారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సభలో మాట్లాడుతున్నప్పుడు టీఆరెస్ ఎంపీలు కనీసం అడ్డు తగల్లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ గాంధిభవన్ లో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ బిజెపి నేతల వైఖరిపై దుయ్యబట్టారు. మోడీ ప్రసంగానికి నిరసన తెలుపుతూ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వాకౌట్ చేస్తే టీఆరెస్ ఎంపీలు మద్దతు తెలుపలేదని మండిపడ్డారు. మోడీ ప్రసంగం పై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని రేవంత్ ప్రశ్నించారు.

కేంద్రంపై యుద్ధం ప్రకటించామన్న కేసీఆర్ మాటలు- తెలంగాణ ఏర్పాటును అవమానిస్తే కనీసం ఖండించడం లేదు ఎందుకని రేవంత్ అడిగారు. నిరసన కార్యక్రమంలో రేబాన్ కళ్ళ అద్దాలు పెట్టుకోని తెరాస నేతలు వచ్చారని, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఐదుగురు మోడీ దిష్టిబొమ్మ తగలబెట్టే కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదన్నారు. తెలంగాణ ద్రోహులు ఇవ్వాళ తెలంగాణ హక్కుల గురించి మాట్లాడుతున్నారని, కేసీఆర్ కుటుంబం మోడీకి దళారులుగా మారారు!- దందాలు చేస్తున్నారు- మోడీకి బానిసలుగా తయారు అయ్యారని ఆరోపించారు.

ధర్నాలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు? తెలంగాణలో పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడున్నారని రేవంత్ అన్నారు. టీఆరెస్ ప్రభుత్వం మారితే పోలీసులను ఎవ్వరూ కాపడలేరని రేవంత్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిన బీజేపీకి తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా? తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా మోడీ ఇక్కడ అడుగు పెట్టనివ్వమని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ లో మోడీ వ్యాఖ్యల పై స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కేసీఆర్ సభలో లేడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణను అవమానించిన బీజేపీకి ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రేవంత్ అన్నారు.

Also Read : కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర – టిపిసిసి

RELATED ARTICLES

Most Popular

న్యూస్