Sunday, January 19, 2025
HomeTrending NewsMLC Elections: ఓటు వేసిన అప్పలనాయుడు- పోలింగ్ పూర్తి

MLC Elections: ఓటు వేసిన అప్పలనాయుడు- పోలింగ్ పూర్తి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది.  మొత్తం 175 ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి ఓటును వినియోగించుకోగా  నెల్లిమర్ల ఎమ్మెల్యే  బొడ్డుకొండ అప్పలనాయుడు  చివరిగా తన ఓటు వేశారు. ఈ ఉదయం అప్పల నాయుడు కుమార్తె వివాహం విజయనగరంలో జరిగింది. వివాహం పూర్తయిన తరువాత ఓటేసేందుకు విశాఖ నుంచి ప్రత్యెక విమానంలో గన్నవరం వచ్చారు. అక్కడినుంచి నేరుగా  అసెంబ్లీకి చేరుకొని ఓటు వేశారు. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.  వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు  ఉండవల్లి లోని తన నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అనతరం వారితో కలిసి అసెంబ్లీకి చేరుకొని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Also Read :  MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్