ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది.  మొత్తం 175 ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి ఓటును వినియోగించుకోగా  నెల్లిమర్ల ఎమ్మెల్యే  బొడ్డుకొండ అప్పలనాయుడు  చివరిగా తన ఓటు వేశారు. ఈ ఉదయం అప్పల నాయుడు కుమార్తె వివాహం విజయనగరంలో జరిగింది. వివాహం పూర్తయిన తరువాత ఓటేసేందుకు విశాఖ నుంచి ప్రత్యెక విమానంలో గన్నవరం వచ్చారు. అక్కడినుంచి నేరుగా  అసెంబ్లీకి చేరుకొని ఓటు వేశారు. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.  వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు  ఉండవల్లి లోని తన నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అనతరం వారితో కలిసి అసెంబ్లీకి చేరుకొని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Also Read :  MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *