Monday, January 20, 2025
HomeTrending Newsఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

గాలి కాలుష్యం ఢిల్లీని కమ్మేస్తున్నది. వాహనాల రద్దీ, పంజాబ్‌‌లో పంట వ్యర్థాలను  కాలుస్తుండటంతో రోజురోజుకూ గాలి నాణ్యత పడిపోతున్నది. ఈ రోజు ఉదయం (గురువారం) ‘వెరీ పూర్’ కేటగిరీలో ఎయిర్ క్వాలిటీ ఉన్నది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని నరేలాలో అత్యధికంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 571గా నమోదైంది. ప్రస్తుతం నార్త్ ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అక్కడ దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ 400 పైనే ఏక్యూఐ ఉంది. మొత్తంగా ఢిల్లీలో 354గా ఉంది. దీంతో గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణాలను, కూల్చివేతలను నిలిపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల పని కోల్పోయిన కార్మికులకు రూ.5 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. కిందటేడాది కూడా ఇలానే 7 లక్షల మంది కూలీలకు సాయం చేసింది.

గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, ఎక్కడికైనా వెళ్లాలంటే కార్ పూలింగ్ లేదా షేరింగ్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఢిల్లీ  పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కోరారు. వాహనాల పొగ వల్లే ఢిల్లీలో 51 శాతం గాలి కలుషితమవుతోందని చెప్పారు. చలి కాచుకునేందుకు బొగ్గు లేదా ఇతర వంట చెరుకును ఉపయోగించొద్దని, ఎలక్ట్రిక్ హీటర్లను ఉపయోగించాలని, ఇండ్లు, ఆఫీసులకు సెక్యూరిటీగా ఉండే వాళ్లకు హీటర్లను ఇవ్వాలని సూచించారు. పటాకులు కాల్చడాన్ని కూడా అవైడ్ చేయాలని కోరారు. ఎవరైనా తమ ఉత్తర్వులను కాదని నిర్మాణ పనులను చేస్తుంటే ఫొటో తీసి ‘గ్రీన్ ఢిల్లీ’ ప్లాట్‌‌ఫామ్‌‌లో అప్‌‌లోడ్ చేయాలని, చర్యలు తీసుకుంటామని చెప్పారు. పొల్యూషన్ హాట్‌‌స్పాట్‌‌లు నరేలా, ఆనంద్ విహార్, ముండ్కా, ద్వారక, పంజాబీ బాగ్ తదితర 13 ఏరియాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.

కాలుష్యం తగ్గేదాకా స్కూళ్లను మూసేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌‌సీపీసీఆర్) కోరింది. తీవ్రంగా ఉన్న కాలుష్యం వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఢిల్లీ సీఎస్‌‌కు ఎన్‌‌సీపీసీఆర్ చైర్‌‌‌‌పర్సన్ ప్రియాంక్ కనూంగో లేఖ రాశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్