Thursday, June 11, 2026
Homeసినిమా‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో పూజా హెగ్డే

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో పూజా హెగ్డే

Pooja for protection of Environment :
మొక్కలు నాటండి – అందమైన ఈ భూమిని, సర్వజీవులను రక్షించాలని పిలుపునిస్తోంది ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడాలని నిరంతరం పరితపిస్తుంది. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటే ఈ బృహత్తర కార్యక్రమం ఖండాంతరాలు దాటి ప్రతీ హృదయాన్ని కదిలిస్తుంది. చేయిపట్టి మొక్కలు నాటిస్తుంది.

ఉద్యమంగా, ఉధృతంగా ముందుకు సాగుతున్న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో, టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన తెలుగింటి బుట్టబొమ్మ పూజాహెగ్డే  ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కను నాటారు. అనంతరం, బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముక్ లకు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’  చేస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ “గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే  ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఈ  కార్యక్రమంలో సంస్థ కో ఫౌండర్ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

Also Read : యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 91వ సినిమా ‘శేఖర్’ గ్లింప్స్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular