Sunday, January 19, 2025
HomeTrending Newsపూతరేకులపై ప్రత్యేక పోస్టల్ కవర్

పూతరేకులపై ప్రత్యేక పోస్టల్ కవర్

ఆత్రేయపురం పూత రేకులకు అరుదైన గౌరవం లభించింది. వీటిపై భారతీయ తపాలా శాఖ ప్రత్యేకంగా కవర్‌ను విడుదల చేసింది.  ఆత్రేయపురం తపాలా శాఖ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన తపాలా కార్యాలయాల్లో పూతరేకుల పోస్టల్‌ కవర్లు అందుబాటులో ఉండనున్నాయి.

ఈ పూత రేకులు అంతర్జాతీయ స్థాయిలో కోట్లాది మంది ప్రజల ఆదరణ దక్కించుకున్నాయి, ఈ కీర్తి దక్కిన పూతరేకులకు చిహ్నంగా భారతీయ తపాలా శాఖ ప్రత్యేకంగా కవర్‌ను విడుదల చేసింది. విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు ప్రత్యేక తపాలా కవరును విడుదల చేశారు. ఈ కవర్‌ ధర రూ.20లుగా నిర్ణయించారు.

సుమారు 300ఏళ్ల క్రితం ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కుటీర పరిశ్రమగా ఏర్పడింది. స్థానిక మహిళలు ఈ పరిశ్రమపై కోట్లాది రూపాయల టర్నోవర్‌ సాధిస్తూ  ఆర్థికంగా అభివృద్ధి చెందారు.  దీనిపై దాదాపు 500 కుటుంబాలకు పైగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు తపాలాశాఖ కవర్ విడుదల చేసి మరోసారి గుర్తింపు ఇచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్