Sunday, June 14, 2026
HomeTrending Newsతెలంగాణలో ఐపీఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణలో ఐపీఎస్‌ అధికారుల బదిలీ

లంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సీఐడీ ఎస్పీగా ఆర్‌ వెంకటేశ్వర్లు, సైబరాబాద్‌ పరిపాలన డీసీపీగా యోగేశ్‌ గౌతమ్‌, పీసీఎస్‌ ఎస్పీగా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్‌ డీసీపీగా రాఘవేందర్‌రెడ్డి, వరంగల్‌ పోలీస్‌ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీశ్‌, వరంగల్‌ నేర విభాగం డీసీపీగా మురళీధర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గత జనవరిలోనూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 25న రాష్ట్రవ్యాప్తంగా 91 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular