Saturday, January 18, 2025
Homeసినిమాప్రభాస్ వెర్సెస్ షారుఖ్..?

ప్రభాస్ వెర్సెస్ షారుఖ్..?

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఈ భారీ, క్రేజీ మూవీ ప్రకటించినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన తర్వాత అయితే.. ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. సెప్టెంబర్ 28న మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇక షారుఖ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జవాన్’. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. జవాన్ ప్రివ్యూ పేరుతో వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

దీంతో ప్రభాస్ వెర్సెస్ షారుఖ్ అనే మాట ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఈ రెండు చిత్రాల టీజర్స్ చూసినట్టులైతే.. రెండూ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా వస్తున్నాయని అర్థమైంది. అందులోను ప్రభాస్ – షారుక్ ఇద్దరూ భారీ అభిమానగణం ఉన్నా పాన్ ఇండియా స్టార్స్ కావడం విశేషం. దీంతో ఈ రెండు చిత్రాల పై బాగా హైప్ క్రియేట్ అయింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాలు సెప్టెంబరు లోనే రిలీజ్ కానున్నాయి. షారుక్ జవాన్ సెప్టంబరు 7న థియేటర్లలో పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతుండగా.. సలార్ సెప్టెంబరు 28న పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ కానుంది.

దీంతో సినీ అభిమానులంతా జవాన్ వర్సెస్ సలార్ షారుక్ వర్సెస్ ప్రభాస్ అంటూ ట్రెండింగ్ చేయడం ప్రారంభించేశారు. ఈ రెండు చిత్రాలకు బాక్సాఫీస్ దగ్గర చెరో 1000కోట్లు కొల్లగొట్టే దమ్ము ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రచారంలో ఉన్నట్టుగా రెండు చిత్రాలు 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తాయా..? ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది..? బాక్సాఫీస్ దగ్గర ఎవరు విజేతగా నిలుస్తారు..? అనేది ఆసక్తిగా మారడంతో సెప్టెంబర్ నెల అత్యంత కీలకంగా మారింది. మరి.. ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు బాక్సాఫీస్ కింగ్ గా నిలుస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్