Saturday, June 13, 2026
Homeసినిమా'కన్నప్ప' .. ఇప్పుడు ప్రభాస్ వంతు!

‘కన్నప్ప’ .. ఇప్పుడు ప్రభాస్ వంతు!

‘కన్నప్ప’ అసలు పేరు ‘తిన్నడు’ .. అతను కొండజాతికి చెందిన ఒక యువకుడు. బ్రతకడానికి కండబలం ఉంటే సరిపోతుంది, భగవంతుడి కరుణతో పనిలేదని భావించిన ‘తిన్నడు’ .. ఆ తరువాత పరమేశ్వరుడిని ప్రాణంగా ఆరాధించడం మొదలుపెడతాడు. భగవంతుడు ప్రత్యక్షమై తన రెండు కళ్లూ తనకి ఇస్తాడని తెలియని ఆయన, తన రెండు కళ్లను స్వామికి సమర్పించడానికి సిద్ధపడతాడు. అందుకే ‘కన్నప్ప’ మహా భక్తుల జాబితాలో కనిపిస్తాడు. అలాంటి ‘కన్నప్ప’ కథతో మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్ చేస్తున్నాడు అనే విషయం బయటికి రాగానే, అంతా కూడా అతను శివుడిగా కనిపిస్తాడని భావించారు. ఈ కథ అంతా కూడా భక్తుడికి .. భగవంతుడికి మధ్య జరుగుతుంది గనుక, ప్రభాస్ కి అంతటి ప్రధానమైన పాత్ర ఇచ్చి ఉంటారని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో శివుడిగా అక్షయ్ కుమార్ ను .. నందీశ్వరుడిగా ప్రభాస్ ను ఫిక్స్ చేశారు. ఈ పాత్రను ఎలా డిజైన్ చేశారనేది సినిమా చూస్తేనేగాని తెలియదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఈ నెల 7వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ఇక్కడ జరుగుతోంది. ప్రభాస్ ఈ సినిమా సెట్లో అడుగుపెట్టినట్టుగా అధికారికంగా తెలియజేశారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా వదిలారు. గతంలో వచ్చిన ‘భక్త కన్నప్ప’ కేవలం కంటెంట్ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లొకేషన్స్ .. మాటలు .. పాటలు .. పాత్రలను మలిచిన తీరు ఆ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. ఇక ఈ సారి వీఎఫ్ ఎక్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. చూడాలి మరి ‘కన్నప్ప’ ఏ స్థాయిలో మెప్పిస్తుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular